- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI: భారత సేవల ఎగుమతులకు ఏఐ బూస్టప్
దీని ద్వారా ఏఐ మొత్తం దేశ సేవల ఎగుమతులు పెరిగేందుకు కీలంగా మారుతోందని భారత్ స్పష్టమైన సంకేతాలను కలిగి ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ సేవల ఎగుమతులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ బూస్టప్‌గా పనిచేస్తోందని వరల్డ్ బ్యాంక్ దక్షిణాసియా చీఫ్ ఎకనమిస్ట్ ఫ్రాంజిస్కా ఓన్సోర్జ్ అన్నారు. మొత్తం సేవల ఎగుమతుల్లో కొంత అస్థిరత ఉన్నప్పటికీ 2022లో చాట్‌జీపీటీ వచ్చినప్పటి నుంచి భారత కంప్యూటర్ సేవల ఎగుమతులు 30 శాతం పెరిగాయి. దీని ద్వారా ఏఐ మొత్తం దేశ సేవల ఎగుమతులు పెరిగేందుకు కీలంగా మారుతోందని భారత్ స్పష్టమైన సంకేతాలను కలిగి ఉంది. ఇప్పటికే అనేక సేవా రంగాలు పనులను ఆటోమేట్ చేయడానికి, డేటాను ప్రాసెస్ చేయడం, రిమోట్ పనులకు ఏఐని ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల ఎగుమతులను మరింత సమర్థవంతంగా, పోటీతత్వంతో చేయడానికి సహాయపడుతోంది.
ముఖ్యంగా ఏఐతో పాటు తయారీ రంగాలు రాబోయే సంవత్సరాల్లో భారత్‌కు రెండు కీలకమైన పెట్టుబడి అవకాశాలుగా మారనున్నాయని ఫ్రాంజిస్కా పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి తర్వాత దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు మందగించినప్పటికీ, ఇప్పటికీ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే వేగంగా పెరుగుతున్నాయి, కానీ నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) బలహీనపడటం ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. భారత్ తన మార్కెట్ యాక్సెస్‌ను పెంచేందుకు రానున్న రోజుల్లో వాణిజ్య అడ్డంకులను, టారిఫ్‌లను తగ్గించాలని కోరారు. అలాగే, భారత్‌లో తయారీ రంగం మునుపతి కంటే అత్యంత వేగంగా దూసుకెళ్తోంది. తక్కువ ఉత్పాదకత కలిగిన రంగాల నుంచి దేశ యువత మరింత ఉద్యోగాలను సృష్టించే అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.






