- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
EU: ట్రంప్ బాటాలోనే యూరప్.. కార్ల దిగుమతి సుంకం తగ్గించాలని భారత్‌కు విజ్ఞప్తి
దీనికి భారత ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాటలోనే యూరోపియన్ యూనియన్ భారత్‌పై పన్నుల విషయంలో పట్టుబడుతోంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందం ప్రకారం, భారత్‌లో కార్ల దిగుమతులపై సుంకాలను తగ్గించాలని కోరుతోంది. దీనికి భారత ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. తాజా ప్రతిపాదనను సాధ్యమైనంత అనుకూలంగా ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యూరప్ కార్ల దిగుమతులపై 100 శాతానికి పైగా ఉన్న సుంకాలను దశలవారీగా 10 శాతానికి తగ్గించే సంకేతాలు కనిపిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే, దీనికి దేశీయ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. సుంకాలను తగ్గించినప్పటికీ, కనీస టారిఫ్ 30 శాతం ఉండేలా చూడాలని కంపెనీ లాబీయింగ్ చేస్తున్నాయి. అంతేకాకుందా దేశీయ కంపెనీలను రక్షించేందుకు మరో నాలుగేళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)పై దిగుమతి సుంకాలను కొనసాగించాలని కొరుతున్నాయి. గతవారం భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో భాగంగా ఈవీలతో పాటు అన్ని కార్ల దిగుమతులపై సుంకాలను తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం కోరింత తర్వాత ఈయూ సైతం అవే డిమాండ్లు ఉంచింది. సుంకాల తగ్గింపు ద్వారా ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ లాంటి యూరప్ కార్ల కంపెనీలకు ప్రయోజనం లభించనుంది. ప్రస్తుతం ఈ అంశం చర్చల దశలోనే ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.






