- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mother Dairy: జీఎస్టీ తగ్గింపును వినియోగదారులకు బదలాయిస్తాం
జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను తమ పాల, ఆహార ఉత్పత్తులకు అమలు చేశామని మంగళవారం ప్రకటనలో వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డెయిరీ వినియోగదారులను గుడ్‌న్యూస్ ప్రకటించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను తమ పాల, ఆహార ఉత్పత్తులకు అమలు చేశామని, తగ్గిన పన్నుల మేరకు ధరలను సవరించినట్టు మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ తగ్గింపును వినియోగదారులకు పూర్తిస్థాయిలో బదలాయిస్తాం. పండుగ సీజన్‌లో చౌకగా తమ ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. తగ్గించిన ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. జీఎస్టీ రేట్ల మార్పు కారణంగా తమ పాలు, వివిధ రకాల ఉత్పత్తులు ఇప్పుడు జీరో ట్యాక్స్ లేదా 5 శాతం పరిధిలోకి వస్తాయి. పనీర్, వెన్న, జున్ను, నెయ్యి, మిల్క్‌షేక్‌లు, ఐస్ క్రీమ్ లాంటి రోజువారీ ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గాయి. ఉదాహరణకు, 500 గ్రాముల వెన్న ప్యాక్ ఇప్పుడు రూ. 305కి బదులుగా రూ. 285కి లభిస్తుంది. బటర్‌స్కాచ్ కోన్ ఐస్ క్రీమ్ రూ. 35 నుంచి రూ. 30కి తగ్గుతుందని మదర్ డెయిరీ వివరించింది. రోజువారీ పాల ప్యాకెట్ల ధరలు కూడా తగ్గుతాయని మదర్ డెయిరీ తెలిపింది. ఒక లీటరు టోన్డ్ టెట్రా ప్యాక్ పాల ధర రూ.77 నుంచి రూ.75కి తగ్గుతాయి. మిగిలిన వాటిపై కూడా జీఎస్టీ ప్రయోజనాలు అందిస్తామని మదర్ డైరీ పేర్కొంది.






