- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Economy: భారత జీడీపీ వృద్ధి అంచనాలను పెంచిన ఆసియా అభివృద్ధి బ్యాంకు
2025-26లో దేశ జీడీపీని గతంలో అంచనా వేసిన 6.5 శాతం నుంచి 7.2 శాతానికి పెంచుతున్నట్టు పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను సవరిస్తున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) బుధవారం ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు, ఫలితంగా పెరిగిన దేశీయ వినియోగం కారణంగా దేశ జీడీపీ మెరుగుపడిందని ఏడీబీ అభిప్రాయపడింది. అందుకే 2025-26లో దేశ జీడీపీని గతంలో అంచనా వేసిన 6.5 శాతం నుంచి 7.2 శాతానికి పెంచుతున్నట్టు పేర్కొంది. భారత్ వేగవంతమైన వృద్ధి కారణంగా మొత్తం ఆసియా ప్రాంత వృద్ధి కూడా గతంలో అంచనా వేసిన 4.8 శాతం నుంచి 5.1 శాతం పెరిగేందుకు సహాయపడుతుంది. మరోవైపు భారత్ రెండో త్రైమాసికంలో గణనీయంగా వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు తొలి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి సాధించిన తర్వాత రెండో త్రైమాసికంలో ఆరు త్రైమాసికాల గరిష్టం 8.2 శాతానికి పెరిగింది. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారత్ 8 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇందుకు ప్రధానంగా తయారీ, సేవల రంగాల విస్తరణ, సరఫరా, డిమాండ్ పెరగడం, వినియోగం, పెట్టుబడులు బలంగా ఉండటం వల్లనే ఈ వృద్ధి జరిగిందని ఏడీబీ తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయం తగ్గడం, ఎంపిక చేసిన భారతీయ ఎగుమతులపై అమెరికా టారిఫ్ పెరగడం వల్ల ఎగుమతులు తగ్గాయి. ఫలితంగా ద్వితీయార్థంలో వృద్ధి నెమ్మదించే అవకాశం ఉందని ఏడీబీ వివరించింది. కానీ, ఊహించిన దానికంటే అధిక వినియోగ డిమాండ్, బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, జీఎస్టీ రేట్ల కోత ప్రభావం, స్థిరమైన క్రెడిట్ వృద్ధి జీడీపీకి దోహదపడుతుందని పేర్కొంది.






