ADB: భారత వృద్ధిని 6.9 శాతానికి పెంచిన ఏడీబీ

by S Gopi |

భారత్‌కు సంబంధించి సవాలుతో కూడిన ప్రపంచ వాతావరణం ఉన్నప్పటికీ, స్థానిక గిరాకీ బలంగా ఉండటం, సులభంగా రుణాలు లభించడం, ఎగుమతులపై అమెరికా టారిఫ్ తగ్గడం వంటి అంశాలు వృద్ధికి దోహదపడుతున్నాయని ఏడీబీ తన నివేదిక వివరించింది.

ADB: భారత వృద్ధిని 6.9 శాతానికి పెంచిన ఏడీబీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, వాణిజ్య అనిశ్చితి ఉన్నప్పటికీ భారత వృద్ధి మెరుగ్గా ఉంటుందని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనదేశం 6.9 శాతం మేర వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ఇది ఇదివరకు 2025, డిసెంబర్‌లో అంచనా వేసిన 6.5 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం. భారత్‌కు సంబంధించి సవాలుతో కూడిన ప్రపంచ వాతావరణం ఉన్నప్పటికీ, స్థానిక గిరాకీ బలంగా ఉండటం, సులభంగా రుణాలు లభించడం, ఎగుమతులపై అమెరికా టారిఫ్ తగ్గడం వంటి అంశాలు వృద్ధికి దోహదపడుతున్నాయని ఏడీబీ తన నివేదిక వివరించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మెరుగుపడుతున్న ఆదాయం, వినియోగం కీలక చోదకంగా కొనసాగనున్నాయి. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల విషయంలో అనుసరిస్తున్న తటస్థ వైఖరితో ద్రవ్యోల్బణం నిలకడగా ఉంది. బలమైన కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు, మెరుగైన బ్యాంకు ఆస్తుల నాణ్యత సహాయంతో పెట్టుబడులు కూడా వృద్ధికి గణనీయంగా దోహదపడతాయని ఏడీబీ అంచనా వేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగితే ఇంధన ధరలు, వాణిజ్య సవాళ్లు ఎదురవుతాయి. ఈ అంశాలు వృద్ధిపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది.

Next Story