- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adani Group: రూ.75,000 కోట్ల భారీ పన్ను చెల్లించిన అదానీ గ్రూప్
అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన రూ. 58,104 కోట్ల కంటే 29 శాతం అధికమని అదానీ గ్రూప్ అధికారిక ప్రకటనలో తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బిలియనీర్, అదానీ గ్రూప్ అధినేత రికార్డు స్థాయిలో పన్నులు చెల్లించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ కంపెనీలు సంయుక్తంగా రూ. 74,945 కోట్ల పన్నులు చెల్లించాయి. ఈ మొత్తం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన రూ. 58,104 కోట్ల కంటే 29 శాతం అధికమని అదానీ గ్రూప్ అధికారిక ప్రకటనలో తెలిపింది. చెల్లించిన మొత్తం పన్నుల్లో ప్రత్యక్ష(రూ. 28,710 కోట్లు), పరోక్ష(రూ. 45,407 కోట్ల) పన్నులు ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగుల సామాజిక భద్రతకు చెల్లించిన మొత్తం కూడా ఉంది. ఇతర విరాళాల మొత్తం విలువ రూ. 818 కోట్లు ఉన్నాయి. దీని ద్వారా దేశంలోని మౌలిక సదుపాయాలను మెరుగు పరచడం, దేశ ఆర్థికవ్యవస్థను పటిష్టం చేయడంలో అదానీ గ్రూప్ భాగస్వామ్యం ఎంతమేరకు ఉందో తెలుస్తుందని కంపెనీ అభిప్రాయపడింది. పన్ను చెల్లింపు ఎక్కువ భాగం అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్), అదానీ సిమెంట్ లిమిటెడ్ (ఏసీఎల్), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్), అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) ఉన్నాయి.
కంపెనీల వారీగా
2024-25లో అధిక పన్నులు కట్టిన కంపెనీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ కార్పొరేట్ పన్నుల రూపంలో రూ. 2,617 కోట్లు, పరోక్ష పన్నుల రూపంలో రూ. 2,681 కోట్లు, ప్రభుత్వ రాయల్టీగా రూ. 2,828 కోట్లు, ప్రత్యక్ష సహకారాల కింద రూ. 420 కోట్లు ఇతర ఛార్జీలు చెల్లించింది. మిగిలిన పన్నులను కూడా కలుపుకుని మొత్తం పన్ను రూ. 24,172 కోట్లని కంపెనీ వెల్లడించింది. అదానీ సిమెంట్ మొత్తం రూ. 16,648 కోట్ల పన్నులను చెల్లించింది. అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ రూ. 10,438 కోట్లు చెల్లించింది.






