Adani Group: రక్షణ తయారీ కోసం అదానీ గ్రూప్ రూ. 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు

by S Gopi |

డ్రోన్లు, మానవరహిత యంత్రాలు, స్మార్ట్ ఆయుధాలపై ప్రధాన దృష్టి ఉంటుంది.

Adani Group: రక్షణ తయారీ కోసం అదానీ గ్రూప్ రూ. 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ వచ్చే ఏడాది రక్షణ తయారీ కోసం రూ. 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. మానవరహిత, అటానమస్ సిస్టమ్స్‌లో సామర్థ్యాన్ని పెంచేందుకు, అధునాతన గైడెడ్ ఆయుధాలతో పాటు దేశ భవిష్యత్తు యుద్ధ సామర్థ్యానికి సంబంధించి కీలక పాత్ర పోషించాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపింది. ఆధునిక యుద్ధ సాంకేతికతపై ముఖ్యంగా డ్రోన్లు, మానవరహిత యంత్రాలు, స్మార్ట్ ఆయుధాలపై ప్రధాన దృష్టి ఉంటుంది. సంస్థ రక్షణ పరికరాలలో కొన్ని ఇప్పటికే నిజమైన సైనిక అవసరాలకు వాడుతున్నారు. సాయుధ దళాలకు అవసరమైన రక్షణ ఉత్పత్తులను కంపెనీ తక్కువ సమయంలో తయారు చేసి సరఫరా చేయగలుగుతోందని కంపెనీ వెల్లడించింది. వచ్చే ఏడాది చాలా తక్కువ మానవ నియంత్రణతో పనిచేసే యంత్రాలు, సముద్రంలో మానవరహిత వాహనాలు, రోబోట్ వాహనాలపై పనిచేస్తున్నాం. ఇవి సైన్యానికి శత్రువులను గమనించడానికి, సమాచారాన్ని సేకరించడానికి, సైనికులకు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని కంపెనీ పేర్కొంది.

Next Story