- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adani Group: పైలట్ శిక్షణ వ్యాపారంలోకి అదానీ గ్రూప్
2012లో ఏర్పాటైన ఎఫ్ఎస్‌టీసీ గురుగ్రామ్, హైదరాబాద్, ముంబైలలో ఉన్న నాలుగు సిమ్యులేటర్ కేంద్రాలను నిర్వహిస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే విమానయాన రంగంలో ఉన్న సంస్థ త్వరలో ఏవియేషన్-శిక్షణ వ్యాపారంలోకి ప్రవేశించనుంది. దీనికోసం అదానీ గ్రూప్ ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్(ఎఫ్ఎస్‌టీసీ)ను కొనుగోలు చేసేందుకు ముందస్తు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 2012లో ఏర్పాటైన ఎఫ్ఎస్‌టీసీ గురుగ్రామ్, హైదరాబాద్, ముంబైలలో ఉన్న నాలుగు సిమ్యులేటర్ కేంద్రాలతో పాటు హర్యానా, సూరత్, సోలాపూర్‌లలో నాలుగు విమాన శిక్షణ అకాడమీలను నిర్వహిస్తోంది. అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ (ఏడీఎస్‌టీ), ప్రైమ్ ఏరో మధ్య 50:50 జాయింట్ వెంచర్ అయిన హారిజన్ ఏరో సొల్యూషన్స్ ద్వారా ఈ కొనుగోలు ప్రణాళికను అమలు చేయాలని భావిస్తున్నారు. ఏడీఎస్‌టీ పూర్తిగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ యాజమాన్యంలో ఉంది. అయితే ప్రైమ్ ఏరోను ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ కుమారుడు ప్రజయ్ పటేల్ ప్రమోట్ చేస్తున్నారు. ఎఫ్ఎస్‌టీసీ కంపెనీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 214.5 కోట్ల ఆదాయాన్ని, రూ. 124.2 కోట్ల నిర్వహణ లాభాలను నమోదు చేసింది.






