భారత విద్యుత్ రంగంలో విప్లవం.. అతి పెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌తో అదానీ గ్రూప్

by Malleboina Mahesh |

భారత విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకునేందుకు అడుగులు పడుతున్నాయి. ప్రముఖ వ్యాపార సంస్థ అయిన అదానీ గ్రూప్‌ మరో కీలక రంగంలో అడుగుపెట్టింది.

భారత విద్యుత్ రంగంలో విప్లవం.. అతి పెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌తో అదానీ గ్రూప్
X

దిశ, వెబ్‌డెస్క్‌: భారత విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకునేందుకు అడుగులు పడుతున్నాయి. ప్రముఖ వ్యాపార సంస్థ అయిన అదానీ గ్రూప్‌ మరో కీలక రంగంలో అడుగుపెట్టింది. సంస్థ Battery Energy Storage Systems (BESS) రంగంలో ప్రవేశిస్తూ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ 1126 మెగావాట్ల శక్తి సామర్థ్యం (Power Capacity), 3530 మెగావాట్‌-గంటల ఎనర్జీ సామర్థ్యంతో (Energy Capacity) రూపుదిద్దుకోనుంది. అంటే, ఈ వ్యవస్థ 3530 MWh శక్తిని నిల్వ ఉంచి, 1126 MW విద్యుత్‌ సామర్థ్యాన్ని సుమారు మూడు గంటల పాటు కొనసాగించగలదు. ఇందులో భాగంగా 700కు పైగా BESS కంటెయినర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద BESS ఇన్‌స్టాలేషన్‌గా నిలవడంతో పాటు ప్రపంచంలోని అతిపెద్ద సింగిల్‌-లొకేషన్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ విప్లవాత్మక ప్రాజెక్ట్‌ 2026 మార్చి నాటికి పూర్తవుతుందని అదానీ గ్రూప్‌ వెల్లడించింది.

Next Story