- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adani Companies: మరోసారి అదానీ కంపెనీలపై అమెరికా ప్రాసిక్యూటర్ల ఆరోపణలు
ఇరానియన్ పెట్రోకెమికల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ అదానీ గ్రూప్ అధినేత, బిలియనీర్ గౌతమ్ అదానీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా అదానీ గ్రూప్ కంపెనీలు ఇరానియన్ పెట్రోకెమికల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. దీనికి సంబంధించి అదానీ కంపెనీలు తమ ముంద్రా పోర్టు ద్వారా ఇరానియన్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పీజీ)ని భారత్‌కు దిగుమతి చేసుకున్నాయా లేదా అనే దానిపై అమెరికా ప్రాసిక్యూటర్లు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొంది. గుజరాత్‌లోని ముంద్రా, పర్షియన్ గల్ఫ్ మధ్య ప్రయాణించే ట్యాంకర్లు ఆంక్షలను తప్పించుకుని వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు సరుకులను రవాణా చేయడానికి ఉపయోగించే అనేక ఎల్‌పీజీ ట్యాంకర్ల కార్యకలాపాలను అమెరికా న్యాయ శాఖ సమీక్షిస్తోందని, సంబంధిత వ్యక్తులు తెలిపారని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది. అయితే, ఇరానియన్ ఎల్‌పీజీ దిగుమతి లేదా అటువంటి చర్యల్లో భాగస్వామ్యం ఉందనడంపై అదానీ గ్రూప్ ఖండించిందని కంపెనీ ప్రతినిధి వాల్‌స్ట్రీట్ జర్నల్‌కి చెప్పారు. ఈ విషయంపై అమెరికా అధికారులు దర్యాప్తు జరుపుతున్నట్టు కూడా తెలియదని స్పష్టం చేశారని పేర్కొంది.
గతంలోనూ లంచం ఆరోపణలు
ఇదివరకు అదానీ గ్రూప్‌నకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు లంచం తీసుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపణలు చేశారు. అదానీతో పాటు, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతో, మరో ఏడుగురు వ్యక్తులు భారత అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచాలు చెల్లించినట్టు అధికారులు చెప్పారు. రెండు దశాబ్దాలలో 2 బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించే లక్ష్యంతో కాంట్రాక్టులను పొందేందుకు, భారత అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని సులభతరం చేయడానికి ఈ వ్యవహారం జరిపినట్టు ఆరోపణలు వచ్చాయి.






