Adani Group: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించిన అదానీ గ్రూప్

by S Gopi |

ఈ కేంద్రం పూర్తి సామర్థ్యంతో దాదాపు మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా అందిస్తుందని కంపెనీ వివరించింది.

Adani Group: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించిన అదానీ గ్రూప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్(బీఈఎస్ఎస్) రంగంలోకి అడుగుపెడుతున్నట్టు అదానీ గ్రూప్ మంగళవారం ప్రకటించింది. దీనికోసం గుజరాత్‌లోని ఖావ్డాలో కంపెనీ అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను నిర్మించే ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ 1,126 మెగావాట్ల సామర్థ్యం, 3,530 మెగావాట్ల విద్యుత్‌ను నిల్వ చేయగలదు. 2026, మార్చి నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుదని, ఈ కేంద్రం పూర్తి సామర్థ్యంతో దాదాపు మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా అందిస్తుందని కంపెనీ వివరించింది. 700 కంటే ఎక్కువ పెద్ద బ్యాటరీ యూనిట్లు ఇక్క ఉంటాయని అదానీ గ్రూప్ చెబుతోంది. కంపెనీ ఇప్పటికే సౌర, పవన శక్తి నుంచి ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు కొత్తగా ఈ విద్యుత్తును నిల్వ చేసిన సరఫరా చేయనుంది. దీనివల్ల విద్యుత్ కోతలను తగ్గించేందుకు వీలవుతుంది. సౌర శక్తి వృధా కాకుండా చూసుకోవచ్చని, నిరంతరం విద్యుత్ సరఫరా లభిస్తుందని కంపెనీ వివరించింది. క్లీన్ ఎనర్జీతో నడిచే భవిష్యత్తుకు ఎనర్జీ స్టోరేజ్ చాలా ముఖ్యం. ఈ ప్రాజెక్ట్ భారత్‌ను ఎనర్జీ రంగంలో మరింత స్వావలంబణ దేశంగా మార్చేందుకు సహాయపడుతుందని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు.

Next Story