- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adani Green: బ్యాటరీ స్టోరేజ్ కోసం అదానీ గ్రీన్ రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 గిగావాట్-అవర్‌కు పైగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి సుమారు రూ. 15,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని కంపెనీ భావిస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో వేగంగా మారుతున్న ఇంధన పరివర్తన నేపథ్యంలో స్థిరమైన క్లీన్ ఎనర్జీ సరఫరా, బ్యాటరీ స్టోరేజ్ కోసం అదానీ గ్రీన్ ఎనర్జీ(ఏజీఈఎల్) భారీ పెట్టుబడులు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 గిగావాట్-అవర్‌కు పైగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి సుమారు రూ. 15,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని కంపెనీ భావిస్తోంది. గుజరాత్‌లోని ఖవాడాలో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్‌లో భాగంగా ఈ స్టోరేజ్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. త్వరలో సుమారు 3 గిగావాట్ అవర్ స్టోరేజ్ సామర్థ్యాన్ని చేరుకుంటామని ఏజీఈఎల్ తెలిపింది. ఈ బ్యాటరీ స్టోరేజ్ సామర్థ్యం ద్వారా సౌర విద్యుత్ తక్కువగా ఉండే సాయంత్రం సమయాల్లో డిమాండ్‌ను తీర్చేందుకు, లోడ్‌ను క్రమబద్ధీకరించడం, 24 గంటలూ పునరుత్పాదక విద్యుత్ అందుబాటులో ఉంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.






