- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Acer India: మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో పెయిడ్ లీవ్ ప్రకటించిన ఏసర్ ఇండియా
దీనికోసం కంపెనీ 'మాతృక' పేరుతో పాలసీని తీసుకొచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ల్యాప్‌టాప్, ఎలక్ట్రిక్ ఉత్పత్తుల సంస్థ ఏసర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా కంపెనీలోని మహిళా ఉద్యోగుల కోసం నెలలో ఒకరోజు నెలసరి సెలవును ప్రకటించింది. ఈ సెలవు పెయిడ్ లీవ్‌గా పరిగణించనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. దీనికోసం కంపెనీ 'మాతృక' పేరుతో పాలసీని తీసుకొచ్చింది. ఉద్యోగంలో ఉన్నప్పుడు మహిళలకు ఉండే సాధారణ సెలవులపై ఎటువంటి ప్రభావం పడకుండా నెలసరి సమయంలో వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు ఏసర్ ఇండియా ఎండీ, ప్రెసిడెంట్ హరీష్ కోహ్లీ చెప్పారు. మహిళల ఆరోగ్యంతో పాటు ఉద్యోగులకు విలువనిచ్చే స్థాయిలో సంస్థను నిర్వహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. కాగా, ఈ నెల ప్రారంభంలో ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ఎల్అండ్‌టీ సైతం ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఉన్న 5,000 మంది మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెలసరి సెలవును ఇచ్చింది. ఈ విషయాన్ని ఎల్అండ్‌టీ సుబ్రహ్మణ్యన్ స్వయంగా ప్రకటించారు. ఎల్అండ్‌టీ మాతృసంస్థలోని మహిళా ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని, టెక్నాలజీ, ఫైనాన్స్ విభాగాల్లోని వారికి ఉండదని కంపెనీ వివరణ ఇచ్చింది. ఇలాంటి ప్రయోజనాన్నే ఫుడ్ డెలివరీ కంపెనీలు జొమాటో, స్విగ్గీ కూడా ప్రకటించాయి.






