Luxury Home Prices: లగ్జరీగా బతకాలంటే ఇండియాలో ఇదే బెస్ట్ ప్లేస్

by Vennela |

Luxury Home Prices: లగ్జరీ ఇళ్ల ధరల్లో ఢిల్లీ ఆరవ, ముంబై 7వ స్థానంలో నిలిచాయి.

Luxury Home Prices: లగ్జరీగా బతకాలంటే ఇండియాలో ఇదే బెస్ట్ ప్లేస్
X

దిశ, వెబ్‌డెస్క్:Luxury Home Prices: లగ్జరీ ఇళ్ల ధరల్లో ఢిల్లీ ఆరవ, ముంబై 7వ స్థానంలో నిలిచాయి. అంతర్జాతీయంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్, ఇటలీలోని మనీలా నగరం మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య నగరంగా పేరొందిన ముంబై నగరాల్లో నివాసం ఉండేందుకు సెలబ్రిటీలు, రాజకీయ, ఆర్థిక, సినిమా, వాణిజ్య రంగ ప్రముఖులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక కార్పొరేట్ సంస్థల ఎగ్జిక్యూటివ్ లు, ప్రభుత్వాధికారులు, ఇతర ప్రముఖులు మెరుగైన వసతులు ఉన్న ప్రాంతాల్లోనే ఉండేందుకు మొగ్గు చూపిస్తుంటారు. అందుకే ఢిల్లీ, ముంబై నగరాల్లో లగ్జరీ ఇళ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. 44 ప్రధాన అంతర్జాతీయ నగరాలతో పోలిస్తే లగ్జరీ ఇళ్ల ధరల్లో న్యూఢిల్లీ ఆరో స్థానం, ముంబై 7వ స్థానంలో నిలిచాయని ప్రముఖ రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ తెలిపింది.

2023-24తో పోలిస్తే డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో సగటున ఇళ్ల ధరలు 6.7శాతం పెరిగాయి. గత డిసెంబర్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 44 నగరాల ఇళ్ల ధరలను విశ్లేషిస్తూ నైట్ ఫ్రాంక్ ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ4 2024 అనే పేరుతో నివేదికను రిలీజ్ చేసింది. స్థానిక కరెన్సీ ధరలతో పోలుస్తూ నైట్ ఫ్రాంక్ ఈ రిపోర్టును రూపొందించింది. దీని ప్రకారం ప్రపంచ దేశాల్లోనే దక్షిణ కొరియా రాజధాని సియోల్ మొదటి స్థానంలో నిలుస్తుంది. సియోల్ లో ఇండ్ల ధరలు 18. 4 శాతం పెరిగితే..మనీలాలో 17.9శాతం, దుబాయిలో 16.9టోక్యోలో 12.7 నైరోబీలో 8.3శాతం పెరిగాయి.

గత 12నెలల్లో న్యూఢిల్లీ ఇండ్ల ధరలు ఇంప్రెసివ్ గా 6.7శాతం పెరిగాయి. లైఫ్ స్టైల్ మెరుగుపడటంతోపాటు ఆర్థికంగా బలోపేతం కావడం దీనికి కారణం. అంతకముందు అక్టోబర్ త్రైమాసికంలో 16వ స్థానంలో నిలిచిన ఢిల్లీ..డిసెంబర్ త్రైమాసికానికి 6వ స్థానానికి దూసుకెళ్లడం ఆసక్తికర పరిణామం అని చెప్పవచ్చు.

మహారాష్ట్ర రాజధాని ముంబైలో గతేడాది కాలంలో ఇండ్ల ధరలు 6.1శాతం పెరిగాయి. బెంగళూరులో ఇళ్ల ధరలు 4.1శాతం వ్రుద్ధితో 23వ ర్యాంక్ సాధించింది. అంతర్జాతీయంగా 44 నగరాల పరిధిలో గత ఏడాది కాలంలో ఇళ్ల ధరలు సగటున 3.2 శాతం పెరిగాయి. 44నగరాలకు 34 నగరాల్లో ఇళ్ల విక్రయాల్లో పాజిటివ్ ధోరణి నెలకొంది. లైఫ్ స్టైల్ అప్ గ్రేడ్ కావడంతోపాటు దేశీయ ఆర్థిక వ్రుద్ధిరేటు పుంజుకోవడం ఇండ్ల విక్రయాలు పెరగడానికి కారణమని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ తెలిపారు. మున్ముందు కూడా ఇళ్ల విక్రయాల్లో సానుకూల ధోరణితో ఇళ్ల ధరలు మరింత పెరుగుతాయని తెలిపారు.

Next Story