- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొనుగోలుదారులకు పండగే.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దారుణంగా పతనమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధలకు ఒక్కసారిగా బ్రేక్ పడి కిందకు దిగొచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ (Hyderabad Bullion Market)లో ఇవాళ బంగారం (Gold), వెండి (Silver) ధరలు ఊహించని విధంగా భారీగా పతనమయ్యాయి. ఒకేరోజు రెండు రకాల పసిడి ధరలు రూ.2 వేల కంటే ఎక్కువ మొత్తంలో తగ్గగా, వెండి ధర ఏకంగా రూ.15,000 మేర క్షీణించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.2,230 మేర భారీ పతనం నమోదైంది. దీంతో నిన్నటి వరకు గరిష్ట స్థాయిలో ఉన్న ఈ పసిడి ధర ప్రస్తుతం రూ.1,56,060కు చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.2,050 మేర తగ్గి రూ.1,43,050 పలుకుతోంది.
అదేవిధంగా బంగారంతో పోటీ పడుతూ గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన వెండి ధరలు ఇవాళ కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చాయి. ఏకంగా ఇవాళ ఒక్కరోజే కేజీ వెండి ధరపై రూ.15,000 పతనమైంది. దీంతో బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం కేజీ వెండి రేటు రూ.2,75,000గా కొనసాగుతోంది.






