- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crude Oil: హార్మూజ్ సంక్షోభంతో భారీగా చమురు ధరలు పెంచిన సౌదీ అరేబియా
బెంచ్‌మార్క్ ధర కంటే అరబ్ లైట్ క్రూడ్ ఆయిల్‌ను సౌదీ ఆరామ్‌కో 19.50 డాలర్లు ఎక్కువకు విక్రయిస్తున్నట్టు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: హార్ముజ్ జలసంధిలో నెలకొన్న అంతరాయాలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్రంగా ప్రభావితం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ఆసియా రిఫైనరీలకు ముడి చమురు ధరను రికార్డు స్థాయికి పెంచిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు, అదనపు సుంకాలు వసూలు చేస్తుండటంతో మే నెలకు సంబంధించిన బెంచ్‌మార్క్ ధర కంటే అరబ్ లైట్ క్రూడ్ ఆయిల్‌ను సౌదీ ఆరామ్‌కో 19.50 డాలర్లు ఎక్కువకు విక్రయిస్తున్నట్టు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. ఇప్పటికే అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి మూతబడటంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అయితే, ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలున్నాయనే సందేహాలతో సౌదీ ఆరామ్‌కో ధరలు పెంచినట్టు బ్లూమ్‌బర్గ్ స్పష్టం చేసింది. అయితే, మార్కెట్ వర్గాలు మాత్రం సౌదీ 40 డాలర్ల వరకు పెంచుతుందని భావించినప్పటికీ, అనుకున్న దానికంటే తక్కువ పెంచింది. కానీ, 19.50 డాలర్ల పెంపు కూడా చారిత్రాత్మక రికార్డు అని వారు పేర్కొన్నారు.






