- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Omelette: ఒక ఆమ్లెట్ ధర రూ. 800 +18 శాతం జీఎస్టీ.. కస్టమర్‌కు షాక్ ఇచ్చిన లగ్జరీ హోటల్
పైగా దానికి అదనంగా 18 శాతం జీఎస్టీ కలుపుకుని మొత్తం రూ. 944 చెల్లించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భోజనప్రియులు హోటళ్లలో తినేందుకు వెళ్లినప్పుడు సాధారంగా ఆమ్లెట్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. గుడ్డు మంచి పోషకాహారం కావడం కూడా ఇందుకు కారణం. బెంగళూరుకు చెందిన ఓ ఇన్వెస్టర్ కూడా అలాగే ఓ ఆమ్లెట్‌ను ఆర్డర్ చేశారు. అయితే, చివర్లో బిల్లు చూసి ఖంగుతిన్నారు. ఎందుకంటే అతను తిన్న ఆమ్లెట్ ధర ఏకంగా రూ. 800 కావడం. పైగా దానికి అదనంగా 18 శాతం జీఎస్టీ కలుపుకుని మొత్తం రూ. 944 చెల్లించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. 'లగ్జరీ హోటళ్లలో సాధారణ ప్లెయిన్ ఆమ్లెట్ ఇంత ఖరీదు ఉండటమేంటి? ఒక ఆమ్లెట్ ఇంత ధర ఎందుకు ఉందో తెలీదంటూ సదరు హోటల్‌పై చర్చకు తెరతీశారు. అతి ఖర్చుతో పరిసరాలను అలంకరించి ఒక ఆమ్లెట్‌పై ఈ స్థాయిలో వసూలు చేయడమేంటని ప్రశ్నించారు. మాములుగా ఒక ఆమ్లెట్ రూ. 25 కంటే ఎక్కువ ఉండదు. కానీ ఈ హోటల్‌లో 96.87 శాతం మార్జిన్ వసూలు చేస్తున్నారని' ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో మంచి భోజనం పేరుతో హోటళ్లు దోపిడీకి తెగబడుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. అలాంటి చోట్లకు వెళ్లే కస్టమర్లు అక్కడ కూర్చుని తినే భోజనానికి కాకుండా పరిసరాల కోసం చెల్లిస్తున్నారని కొందరు అభిప్రాయపడగా, మరికొందరు ప్రీమియం హోటళ్లు రకరకాల పేర్లతో అధిక మార్జిన్‌లను దండుకుంటున్నాయని విమర్శించారు.






