50 పైసల నాణేలు చెల్లవా?

by Muthe.Rajitha |

ఇకపై 50 పైసల నాణేలు చెల్లవా? మరి ఈ విషయంపై ఆర్బీఐ ఏం చెప్పిందో చూద్దాం.

50 పైసల నాణేలు చెల్లవా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఇకపై 50 పైసల నాణేలు చెల్లవా? మరి ఈ విషయంపై ఆర్బీఐ ఏం చెప్పిందో చూద్దాం. నాణేలపై ప్రజల్లో ఉన్న అపోహలు పోగేట్టేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న 50 పైసలు మొదలుకొని, రూ.1, 2, 5, 10, 20 నాణేలు అన్నీ చెల్లుబాటు అవుతాయని క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికీ ఈ నాణేలన్నీ పూర్తిగా చలామణిలో ఉన్న చట్టబద్ధ కరెన్సీ అని స్పష్టం చేసింది. నాణేలపై తప్పుడు సమాచారం, వదంతులను నమ్మవద్దని సూచించింది.

వ్యాపారులు గాని ఎవరైనా గాని ఎలాంటి సంకోచం లేకుండా నాణేలను తీసుకోవాలని కోరింది. ముఖ్యంగా రూ.10 నాణేలు, 50 పైసల నాణెం గురించి ప్రజల్లో ఉన్న అపోహలను పోగేట్టేందుకు వాట్సాప్ సందేశాలను కూడా పంపిస్తోంది. కావున ఇకపై 50 పైసల నాణేలు, రూ.10 నాణేలు పూర్తిగా చెల్లుబాటు అవుతాయన్నమాట. ఎలాంటి భయం లేకుండా వాటిని చలామణి చేయవచ్చు.

Next Story