- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: అమెరికా సుంకం వల్ల భారత ప్రపంచ ఎగుమతులపై ప్రభావం తక్కువే
టారిఫ్ విధించినప్పటికీ మొత్తం భారత్ ప్రపంచ ఎగుమతుల్లో 1.87 శాతం మాత్రమే దెబ్బతినే అవకాశం ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా భారత్‌పై విధించిన 25 శాతం సుంకాలు, జరిమానా ఈ నెల 7 నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాటి ప్రభావం పెద్దగా ఉండదని పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(పీహెచ్‌డీసీఐ) వెల్లడించింది. బుధవారం పీహెచ్‌డీసీఐ విడుదల చేసిన కొత్త శ్వేతపత్రం ప్రకారం, అమెరికా 25 శాతం మేర టారిఫ్ విధించినప్పటికీ మొత్తం భారత్ ప్రపంచ ఎగుమతుల్లో 1.87 శాతం మాత్రమే దెబ్బతినే అవకాశం ఉంది. విలువ పరంగా 8.1 బిలియన్ డాలర్ల(రూ. 71 వేల కోట్ల) మేర ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది భారత్ మొత్తం సరుకుల ఎగుమతుల్లో చాలా తక్కువ భాగం. 2024-25లో భారత్ మొత్తం రూ. 86.5 బిలియన్ డాలర్లు(రూ. 7.6 లక్షల కోట్ల) విలువైన సరుకులను ఎగుమతి చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా సుంకాల వల్ల భారత జీడీపీపై పడే ప్రభావం కూడా అత్యల్పంగా 0.19 శాతంగా పీహెచ్‌డీసీఐ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన దేశాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా కొనసాగుతోంది. సుంకాల ఎఫెక్ట్ ఉన్నప్పటికీ భారత వృద్ధి తట్టుకోగలదని పీహెచ్‌డీసీఐ అధ్యక్షుడు హేమంత్ జైన్ అన్నారు. ఎక్కువగా ప్రభావితం అయ్యే రంగాల్లో ఇంజనీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, రత్నాభరణాలు, రెడీమేడ్ దుస్తులు ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకు, ఎగుమతులను పెంచి గ్లోబల్ మార్కెట్లో మరింత దూకుడుగా వ్యవహరించేలా, ఉత్పత్తిని పెంచడం, ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతోందని పీహెచ్‌డీసీఐ పేర్కొంది.






