సామాన్యులకు గుడ్ న్యూస్..తక్కువ ధరకే కొత్త కారు లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే

by velandi.Saikiran |

రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ పేరుతో లాంచ్ చేసింది కంపెనీ. 6.29 లక్షలకు ఈ కారు బేస్ ప్రైజ్ ఫిక్స్ చేసింది.

సామాన్యులకు గుడ్ న్యూస్..తక్కువ ధరకే కొత్త కారు లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియాలో కార్ల వినియోగం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే కార్ల కంపెనీలు కూడా రకరకాల వాహనాలను తీసుకువస్తున్నాయి. తక్కువ ధరలో సామాన్యులు కొనుగోలు చేసే విధంగా... కార్లను లాంచ్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో రెనాల్ట్ నుంచి... కొత్త కారు వచ్చేసింది.

రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ ( Renault Kiger facelift ) పేరుతో తాజాగా లాంచ్ చేసింది కంపెనీ. సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా 6.29 లక్షలకు ఈ కారు బేస్ ప్రైజ్ ఫిక్స్ చేసింది. ఇక ఇందులో టాప్ మోడల్ కారు కొనుగోలు చేయాలంటే 11.29 లక్షలు కావాల్సిందే. ఈ పై ధరలు ఎక్స్ షోరూం ధర ప్రకారం మాత్రమే. కారు బయటకు వచ్చేసరికి రేటు మరింత పెరుగుతుంది.

ఇందులో ఒయాసిస్ ఎల్లో డ్యూయల్ టోన్ కలర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ కారుకు 360 డిగ్రీ మల్టీ వ్యూ కెమెరా అందిస్తున్నారు. 8 ఇంచుల టచ్ స్క్రీన్ కూడా ఇస్తోంది కంపెనీ. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయని కంపెనీ వెల్లడించింది. పెట్రోల్ వెహికల్ కావడం గమనార్హం. సాధారణ పెట్రోల్ అయితే, 72bhp/96nm టార్క్ రిలీజ్ చేస్తుంది ఈ కారు. టర్బో పెట్రోల్ అయితే 100bhp/160nm టార్క్ రిలీజ్ చేస్తుంది.

Next Story