సరికొత్త ఫీచర్లతో ఏప్రిలియా స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే

by velandi.Saikiran |

భారత మార్కెట్లోకి అనేక రకాల స్కూటర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంటికి రెండు వాహనాలు అన్నట్లుగా.. ప్రస్తుతం

సరికొత్త ఫీచర్లతో ఏప్రిలియా స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: భారత మార్కెట్లోకి అనేక రకాల స్కూటర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంటికి రెండు వాహనాలు అన్నట్లుగా.. ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి నెలకొంది. దీనికి తగ్గట్టుగానే వాహనాల కంపెనీలు రకరకాల బైక్స్ తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా ఇండియన్ మార్కెట్లోకి మరో సరికొత్త స్కూటర్ వచ్చింది. ఇటలీకి చెందిన ఏప్రిలియా ( Aprilia Bikes ) ప్రీమియం శ్రేణిలో ఎస్ ఆర్ 175 పేరుతో కొత్త స్కూటర్ ను తీసుకువచ్చింది.

ఇక ఈ స్కూటర్ ధర ఎక్స్ షోరూం ప్రకారం 1.26 లక్షలు గా నిర్ణయించారు. గతంలో ఇదే కంపెనీ తీసుకు వచ్చిన ఎస్ఆర్ 160 స్థానంలో 175 మోడల్ ను తాజాగా రిలీజ్ చేసింది ఏప్రిలియా కంపెనీ. అచ్చం ఎస్ ఆర్ 160 తరహాలోనే ఈ స్కూటర్ కూడా ఉంది. ఇక ఈ కొత్త స్కూటర్లో 174.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ను అమర్చారు.

అలాగే 7200 ఆర్పిఎం వద్ద 12.92 హెచ్పీ శక్తిని ఈ బైక్ రిలీజ్ చేస్తుంది. ఇక ఈ బైక్ టార్క్ వచ్చేసి 13.44 ఎన్ఎం నుంచి 14.14 వరకు పెరిగింది. కలర్ టి ఎఫ్ టి డిస్ప్లే బ్లూటూత్ కనెక్టివిటీ తో ఈ బైక్ తీసుకువచ్చారు. ఈ బైక్ ముందు అలాగే వెనుక టైర్లు 14 అంగుళాలు ఉంటాయి.

Next Story