Zomato: జొమాటో నుంచి 19 వేల రెస్టారెంట్లు తొలగింపు.. కారణమిదే?

by Yella Dhawani Reddy |

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో (Zomato) పలు రెస్టారెంట్లకు షాకిచ్చింది.

Zomato: జొమాటో నుంచి 19 వేల రెస్టారెంట్లు తొలగింపు.. కారణమిదే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో (Zomato) పలు రెస్టారెంట్లకు షాకిచ్చింది. వినియోగదారుల ఫిర్యాదు ఆధారంగా ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లు, ఇతర బ్రాండ్​లను కాపీ చేసి కస్టమర్లను తప్పుదారి పట్టించిన దాదాపు 19,000 రెస్టారెంట్లను యాప్ నుంచి తొలగించింది. ఈ విషయాన్ని స్వయంగా సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) తెలిపారు.

ఈ ఏడాది జొమాటో ఫుడ్ డెలివరీ విభాగంలో ఊహించిన దాని కంటే చాలా తక్కువ వృద్ధిని నమోదు చేసింది. గతేడాది నవంబర్​లో కంపెనీ వార్షిక (ఇయర్ ఆన్ ఇయర్​) వృద్ధి 20 శాతంగా ఉండాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కానీ వాస్తవానికి జొమాటో వృద్ధి చాలా తక్కువగా ఉందని గోయల్​ పేర్కొన్నారు. వినియోగదారులు ముఖ్యంగా రెస్టారెంట్లకు వెళ్లడం, అక్కడ నుంచి ఆహారాన్ని తెప్పించుకోవడం బాగా తగ్గించారని చెప్పారు. అలాగే, ఫుడ్‌ డెలివరీ విభాగంలో పోటీ పెరుగుతుందని, డెలివరీ సిబ్బందికి కూడా డిమాండ్ బాగా పెరుగటంతో జొమాటో తాత్కాలికంగా డెలివరీ పార్టనర్స్​ కొరతను ఎదుర్కొంటోందన్నారు.

కాగా, తాజాగా జొమాటో క్విక్‌ డెలివరీ సేవలను మళ్లీ నిలిపేసింది. ఫలితంగా ప్రారంభించిన నాలుగు నెలలకే క్విక్‌ డెలివరీ సేవలు క్లోజ్‌ అయ్యాయి. 2022లో 'జొమాటో ఇన్‌స్టంట్' పేరుతో 10 నిమిషాల డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించి, ఏడాదిలోనే నిలిపివేసింది. తాజాగా మరోసారి క్విక్ సేవను కూడా ఆపేయడం వెనుక నిర్వహణలో ఏర్పడిన సవాళ్లు, పోటీ సంస్థల ఒత్తిడి వంటి అంశాలే ప్రధాన కారణాలుగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story