- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115వ స్థాపన దినోత్సవం
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115వ స్థాపన దినోత్సవాన్ని ముంబైలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థి

దిశ , తెలంగాణ బ్యూరో : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115వ స్థాపన దినోత్సవాన్ని ముంబైలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం కార్యదర్శి ఎం. నాగరాజు, ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ తొలి స్వదేశీ బ్యాంక్‌గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. సామాన్య ప్రజలకు సేవలందించడంలో బ్యాంక్ నిబద్ధతకు నిదర్శనంగా రుణాలలో 72 శాతం రిటైల్–అగ్రికల్చర్–ఎంఎస్‌ఎంఈ (రామ్) విభాగం వాటా ఉందని తెలిపారు. బ్యాంక్ వ్యాపారం లాభదాయకత మెరుగుపడిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఎండీ సీఈఓ కల్యాణ్ కుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 21,492 టచ్ పాయింట్లు, 4,556 బ్రాంచ్లు ఉన్నాయని, వీటిలో 65 శాతం గ్రామీణ, అర్ధగ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలిపారు. జూన్ 30 నాటికి బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.7.37 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. స్థాపన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా సామాజిక బాధ్యతకు అనుగుణంగా పలు కార్యక్రమాలు నిర్వహించగా, దేశవ్యాప్తంగా 25,000కు పైగా మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలు కస్టమర్ ఫ్రెండ్లీ ఉత్పత్తులను బ్యాంక్ ఆవిష్కరించగా, కస్టమర్ సర్వీస్ గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ హ్యాండ్‌బుక్‌ను ఎం. నాగరాజు ఆవిష్కరించారు






