100 Rupee Note: వెరీ బిగ్‌ అలెర్ట్.. రూ.100 నోట్లపై RBI ఏం ప్రకటించిందో తెలుసా?

by Vennela |

Currency Note: మనం ఎక్కువగా ఉపయోగించే నెట్లలో 100 రూపాయల నోటు కూడా ఒకటి. ఈ నోట్లపై దేశ ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిక జారీ చేసింది.

100 Rupee Note: వెరీ బిగ్‌ అలెర్ట్.. రూ.100 నోట్లపై RBI ఏం ప్రకటించిందో తెలుసా?
X

Currency Note: దేశంలో అత్యధికంగా 100 రూపాయల నోటును ఉపయోగిస్తుంటారు. చిన్న కిరణా షాప్ నుంచి పెద్ద పెద్ద మార్కెట్ల వరకు ఈ నోటును వాడుతుంటారు. అయితే ఈ నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిగ్ అలర్ట్ జారీ చేసింది.దేశవ్యాప్తంగా నకిలీనోట్లపై ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ. 100 నుంచి రూ. 500 వరకు అన్ని రకాల నకిలీ నోట్లపై పెరుగుతున్న ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నకిలీ నోట్లపై ప్రధాన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

ఆర్బిఐ విడుదల చేసిన ఈ గైడ్ లైన్స్ లో అసలైన, నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో తెలుసుకునేందుకు మీకు సహాయం చేసే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మీ దగ్గర రూ. 100 నోటు అసలా..నకిలీదా అని తెలుసుకోవచ్చు. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత మార్కెట్లో ఫేక్ కరెన్సీ బాగా పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆర్బిఐ 2020-21 వార్షిక రిపోర్టు రూ. 5కోట్లకు పైగా విలువైన ఫేక్ కరెన్సీని గుర్తించింది. దీనిలో అత్యధికంగా 100 రూపాయల నోట్లే ఉన్నాయి. అసలు, నకిలీ 100 రూపాయల నోట్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన తర్వాత మోసగాళ్లు దేశంలో రూ. 100, 200 ఫేక్ నోట్ల సరఫరాను పెంచారు. ఆర్బీఐ ప్రకటించినప్పటి నుంచి దాదాపు ప్రతిరోజూ ఫేక్ కరెన్సీ బారిన పడి ప్రజలు బలవుతున్నారు. చాలా సార్లు, తెలిసి లేదా తెలియన ఫేక్ కరెన్సీ అమాయకుల జేబుల్లోకి వస్తున్నాయి.

అసలు 100 రూపాయల నోటులో వాటర్ మార్క్ పక్కన నిలువు బ్యాండ్ లో తయారు చేసిన పూల డిజైన్ ఉంటుంది. ఇది ఫేక్ కరెన్సీలో కనిపించదు. మీరు నోట్ వాటర్ మార్క్ లో తేలికపాటి నీడలో గాంధీజీ ఫొటోను కూడా చూడవచ్చు. 100టెక్ట్స్ లు కనిపిస్తాయి. నోటును కొద్దిగా క్రాస్ చేసి చూస్తే అవి మనకు కనిపిస్తాయి. కనిపించలేదంటే అది ఫేక్ కరెన్సీ అని అర్ధం.

అదే విధంగా నోట్ లో 2 ఎంఎం సెక్యూరిటీ థ్రెడ్ పై ఇండియా, ఆర్బిఐ అని రాసి ఉంటుంది. పలు కోణాల్లో చూస్తే ఈ థ్రెడ్ బ్లూ, గ్రీన్ కలర్ కనిపిస్తుంది. నోటుపై ఉన్న గాంధీ, నిలువు బ్యాండ్ మధ్య ఈ ప్రదేశాన్ని గమిస్తే ఆర్బిఐ 100 అని రాసి ఉంటుంది. ఈ విధంగా మీరు అసలు, నకిటీ నోట్లను గుర్తించవచ్చు.

Next Story