- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HSBC Hurun: ప్రపంచ అత్యంత విలువైన కంపెనీల్లో ప్రభావవంతమైన భారతీయ సీఈఓలు
2024 ఏడాదికి సంబంధించి జాబితాలో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల అగ్రస్థానంలో నిలిచారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ హెచ్ఎస్‌బీసీ హురున్ ఆసక్తికర జాబితాను విడుదల చేసింది. ఈసారి ప్రపంచ వ్యాపార రంగంలో భారత ఖ్యాతిని ప్రభావితం చేస్తున్న గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్‌ను విడుదల చేసింది. 2024 ఏడాదికి సంబంధించి హెచ్ఎస్‌బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ జాబితాలో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల అగ్రస్థానంలో నిలిచారు. కంపెనీ అంతర్జాతీయ స్థాయిలో విజయవంతంగా కొనసాగేందుకు, టెక్ ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకురావడంలో సత్య నాదేళ్ల కీలకంగా వ్యవహరించారని హెచ్ఎస్‌బీసీ హురున్ నివేదిక అభిప్రాయపడింది. ఈ జాబితాలో మొత్తం 200 కంపెనీల నుంచి 226 మంది ఉన్నారని, వాటి విలువ 10 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని నివేదిక తెలిపింది. జాబితాలో సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్, ఏఐ సహా వివిధ పరిశ్రమలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. సత్య నాదేళ్ల తర్వాత గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. లిస్ట్‌లోని టాప్ 10 వ్యక్తులు మొత్తం జాబితాలోని వారి విలువలో 73 శాతం వాటాను కలిగి ఉండటం గమనార్హం. అలాగే, 87 మంది సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీలకు చెందినవారు, ఆ తర్వాత ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాల వారు ఉన్నారు. మొదటి పది మందిలో నీల్ మోహన్ తర్వాత గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, లిండే సీఈఓ సంజీవ్ లాబా, నోవార్టిస్ సీఈఓ వసంత్ నరసింహన్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, హనీవెల్ ఇంటర్నేషనల్ సీఈఓ విమల్ కపూర్, స్ట్రైకర్ సీఈఓ కెవ్న్ లోబో ఉన్నారు.






