- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేరుకు యాచకుడు.. ఇంట్లో ట్రంకు పెట్టెల్లో ‘నోట్ల’ కట్టలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలో ఓ యాచకుడి ఇంట్లో రూ.10 లక్షలు బయటపడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. శేషాచల నగర్‌లోని అతడి నివాసంలో ట్రంకు పెట్టెల నిండా నోట్ల కట్టలు బయటపడ్డాయి. వివరాల ప్రకారం.. యాచకుడు శ్రీనివాసన్ తిరుమల కొండపైకి వచ్చే వీఐపీల వద్ద భిక్షాటన చేసేవాడు. తిరుమల నిర్వాసితుడి కేటగిరీలో అతడికి తిరుపతిలో శేషాచల నగర్‌లో ఇంటిని కేటాయించారు. ఇదిలా ఉండగా గత ఏడాది అనారోగ్యం కారణంగా శ్రీనివాసన్ మృతి చెందాడు. అతడికి కుటుంబ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలో ఓ యాచకుడి ఇంట్లో రూ.10 లక్షలు బయటపడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. శేషాచల నగర్‌లోని అతడి నివాసంలో ట్రంకు పెట్టెల నిండా నోట్ల కట్టలు బయటపడ్డాయి. వివరాల ప్రకారం.. యాచకుడు శ్రీనివాసన్ తిరుమల కొండపైకి వచ్చే వీఐపీల వద్ద భిక్షాటన చేసేవాడు. తిరుమల నిర్వాసితుడి కేటగిరీలో అతడికి తిరుపతిలో శేషాచల నగర్‌లో ఇంటిని కేటాయించారు. ఇదిలా ఉండగా గత ఏడాది అనారోగ్యం కారణంగా శ్రీనివాసన్ మృతి చెందాడు.
అతడికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో శేషాచల నగర్‌లోని అతడి నివాసాన్ని టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించిన టీటీడీ అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రెండు పెట్టెలు తెరిచి చూడగా, అందులో కరెన్సీ కట్టలు కనిపించాయి. వాటి విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Next Story






