బంపర్ ఆఫర్ : Fixed Deposit చేయాలనుకుంటున్నారా.. ఇది మీ కోసమే..

by  |
deposit
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం వలన తమ దగ్గర ఉన్న డబ్బును పొదుపు కోసం అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల వైపు ప్రజలు చూస్తున్నారు. కరోనా కారణంగా బ్యాంకులు వడ్డీ రేట్లు కూడా చాలా వరకు తగ్గించాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 5-6 శాతం మధ్యలో ఉన్నాయి. ఇంతకు ముందు ఉన్న వడ్డీ రేట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కానీ ఇలాంటి టైంలో కూడా అధిక వడ్డీ ఇచ్చే వారు ఉంటే అదృష్టంగా భావించాలి.

మరి అలాంటి సంస్థ ఏది అంటే, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని తమిళనాడు పవర్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TN పవర్ ఫైనాన్స్) దాని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.77% వరకు వడ్డీ రేటును అందిస్తోంది.

TN పవర్ ఫైనాన్స్ వివిధ రకాలుగా వడ్డీ చెల్లింపులు చేస్తుంది. నెల వారీగా వడ్డీ చెల్లింపు 2 సంవత్సరాలకు 7.50శాతం, 3 ఏళ్లకు 8.25 శాతం, 5 ఏళ్లకు గాను 8.50 శాతం వడ్డీని పొందవచ్చు. అదే విధంగా 3 నెలల వడ్డీ చెల్లింపులో 2 సంవత్సరాలకు 7.50శాతం, 3 ఏళ్లకు 8.25 శాతం, 5 ఏళ్లకు గాను 8.50 శాతం వడ్డీ వస్తుంది. కానీ సంవత్సరానికి వడ్డీ చెల్లింపు తీసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్ కానీ వారికి కూడా వడ్డీ శాతం పెరుగుతుంది. సంవత్సరం వడ్డీ 2 సంవత్సరాలకు 7.50శాతం, 3 ఏళ్లకు 8.25 శాతం, 5 ఏళ్లకు గాను 8.77 శాతానికి వడ్డీ పెరుగుతుంది. కొన్ని స్కీంల ద్వారా సీనియర్ సిటిజన్ కాని వారు కూడా అధిక వడ్డీని పొందవచ్చు. అయితే వారు కేవలం 5 సంవత్సరాల డిపాజిట్‌తోనే అధిక వడ్డీని పొందవచ్చు.

డిసెంబరు 2, 2021 నాటికి ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు..

సీనియర్ సిటిజన్ కాని వారికి సంవత్సరానికి 7.00%, 3 సంవత్సరాలు 7.75%, 4 సంవత్సరాలు 7.75%, 5 సంవత్సరాలు 8.00%. సీనియర్ సిటిజన్ వారికి సంవత్సరానికి 7.25%, 3 సంవత్సరాలు 8.25%, 4-సంవత్సరాలు 8.25%, 5 సంవత్సరాలు 8.50%.

TN పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిపాజిట్లు కస్టమర్‌లను 8.77% వడ్డీ రేట్లతో ఎక్కువ ఆకర్షిస్తున్నాయి. తమిళనాడు పవర్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిపాజిట్‌లు పూర్తిగా తమిళనాడు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున, ఇది సురక్షితంగా ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లతో తీవ్రంగా నష్టపోయిన సీనియర్ సిటిజన్లకు ఇది మంచి అవకాశం. బ్యాంకులతో పోల్చినప్పుడు సీనియర్ సిటిజన్లు కాని వారికి కూడా డిపాజిట్లు ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. ఆన్‌లైన్‌లో, లేదా యాప్‌ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ చేసుకోని దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం TN పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

Next Story

Most Viewed