- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాల జిల్లాలో కాల్పుల కలకలం
by Batti.Sumithra |
<p> జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామంలో కాల్పుల కలకలం రేగింది. కుటుంబ కలహాలతో మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన పాట శ్రీనివాస్ తన భార్య మౌనికపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మౌనిక మేనమామ బైరం రాజిరెడ్డి అడ్డురావడంతో ఆయనకూ బుల్లెట్ గాయాలయ్యాయి. ఐదు రౌండ్లు కాల్పులు జరపగా రెండు రౌండ్లు బుల్లెట్లు రాజిరెడ్డి శరీరంలోకి దూసుకెళ్లాయి. రాజిరెడ్డిని జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స […]</p>

X
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామంలో కాల్పుల కలకలం రేగింది. కుటుంబ కలహాలతో మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన పాట శ్రీనివాస్ తన భార్య మౌనికపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మౌనిక మేనమామ బైరం రాజిరెడ్డి అడ్డురావడంతో ఆయనకూ బుల్లెట్ గాయాలయ్యాయి. ఐదు రౌండ్లు కాల్పులు జరపగా రెండు రౌండ్లు బుల్లెట్లు రాజిరెడ్డి శరీరంలోకి దూసుకెళ్లాయి. రాజిరెడ్డిని జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, గత కొంత కాలంగా శ్రీనివాస్, మౌనికల మధ్య విభేదాలు రావడంతో ఆమె తన మేనమామ ఇంట్లోనే ఉంటోందని గ్రామస్తులు తెలిపారు. భార్య రావడం లేదన్న కోపంతోనే శ్రీనివాస్ కాల్పులు జరిపాడా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తోంది.
Next Story






