జనవరి 29 నుంచి బడ్జెట్ సమావేశాలు

31

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు తొలి విడత సమావేశాలు కొనసాగనున్నాయి. అలాగే మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.