- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈసీ చర్య రాక్షస రాజ్యానికి చెంపపెట్టు: బుద్ధా వెంకన్న
by Vemula.Srinu Prasad |
<p>ఈసీ చర్య రాక్షస రాజ్యానికి చెంపపెట్టు అంటూ.. వైసీపీ ప్రభుత్వంపై బుద్ధా వెంకన్న పరోక్షంగా విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలువురు అధికారులను బదిలీ చేయాలని తాజాగా ఈసీ ఆదేశించింది. కాగా, ఈ అంశంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా స్పందించారు. నియంతపై ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. నాడు ఐఏఎస్‌లను జైలుకి పంపారని.. నేడు ఐపీఎస్ అధికారులను కోర్టు ముందు నిలబెట్టారని విమర్శలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీలు, వేటుకి కారణమయ్యారని […]</p>
ఈసీ చర్య రాక్షస రాజ్యానికి చెంపపెట్టు అంటూ.. వైసీపీ ప్రభుత్వంపై బుద్ధా వెంకన్న పరోక్షంగా విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలువురు అధికారులను బదిలీ చేయాలని తాజాగా ఈసీ ఆదేశించింది. కాగా, ఈ అంశంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా స్పందించారు. నియంతపై ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. నాడు ఐఏఎస్‌లను జైలుకి పంపారని.. నేడు ఐపీఎస్ అధికారులను కోర్టు ముందు నిలబెట్టారని విమర్శలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీలు, వేటుకి కారణమయ్యారని నిందించారు. స్థానిక సంస్థలను కబ్జా చేయడానికి మాపై హత్యాయత్నం చేశారని ఆయన ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇక ఈసీ చర్య రాక్షస రాజ్యానికి చెంపపెట్టులా మారిందని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
Tags: Buddha Venkanna, comments, twitter, ycp
Next Story






