బ్రేకింగ్: విరిగిపడిన కొండచరియలు.. 9 మంది మృతి.. ఇంకా (వీడియో)

by Vadlamudi Anukaran |   (  Updated:2021-07-25 10:09:28  IST  )

<p>షిమ్లా: బ్రిడ్జీపై కొండచరియలు విరిగిపడి 9మంది పర్యాటకులు మృతిచెందారు. ఈ విషాదకర ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సంగ్లా లోయలో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి సంగ్లా లోయలోని వంతెనను ఢీకొట్టాయి. దీంతో సగం వంతెన నదిలో పడిపోయింది. ఈ సమయంలో 11 మంది పర్యాటకులతో ఉన్న వాహనాన్ని సైతం బండరాళ్లు ఢీకొట్టడంతో అందులో 9మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక [&hellip;]</p>

heavy rains
X

షిమ్లా: బ్రిడ్జీపై కొండచరియలు విరిగిపడి 9మంది పర్యాటకులు మృతిచెందారు. ఈ విషాదకర ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సంగ్లా లోయలో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి సంగ్లా లోయలోని వంతెనను ఢీకొట్టాయి. దీంతో సగం వంతెన నదిలో పడిపోయింది. ఈ సమయంలో 11 మంది పర్యాటకులతో ఉన్న వాహనాన్ని సైతం బండరాళ్లు ఢీకొట్టడంతో అందులో 9మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక ఎస్పీ సాజు రామ్ రానా వెల్లడించారు. ఇద్దరు గాయాలపాలైనట్టు చెప్పారు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ థాకూర్ ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు.

Himachal Pradesh: Major accident in Kinnaur, rocks killed 9 people! | NewsTrack English 1

Next Story