- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఎంసీ కీలక నిర్ణయం
<p>ముంబయి: బ్రిహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంఐ)కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయిలోని షాపింగ్ మాల్స్‌లో అడుగుపెట్టాలంటే కొవిడ్-19 టెస్ట్ రిపోర్టును సమర్పించాల్సిందేనని బీఎంఐ తెలిపింది. ఇక నుంచి మాల్స్ లోకి ప్రవేశానికి కొవిడ్ టెస్టు రిపోర్టును తప్పనిసరి చూపించాలని తెలిపింది. కొవిడ్ రిపోర్టులు అందజేయని వారికి మాల్స్ వద్దే యాంటిజెన్ టెస్టులు నిర్వహించనున్నట్టు తెలిపింది. దీని కోసం ముంబయిలోని అన్ని షాపింగ్ మాల్స్ వద్ద ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల సౌకర్యాన్ని కల్పించనున్నట్టు పేర్కొంది. టెస్టుల నిర్వహణ కోసం ప్రతీ […]</p>

ముంబయి: బ్రిహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంఐ)కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయిలోని షాపింగ్ మాల్స్‌లో అడుగుపెట్టాలంటే కొవిడ్-19 టెస్ట్ రిపోర్టును సమర్పించాల్సిందేనని బీఎంఐ తెలిపింది. ఇక నుంచి మాల్స్ లోకి ప్రవేశానికి కొవిడ్ టెస్టు రిపోర్టును తప్పనిసరి చూపించాలని తెలిపింది. కొవిడ్ రిపోర్టులు అందజేయని వారికి మాల్స్ వద్దే యాంటిజెన్ టెస్టులు నిర్వహించనున్నట్టు తెలిపింది. దీని కోసం ముంబయిలోని అన్ని షాపింగ్ మాల్స్ వద్ద ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల సౌకర్యాన్ని కల్పించనున్నట్టు పేర్కొంది. టెస్టుల నిర్వహణ కోసం ప్రతీ మాల్ వద్ద ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయనున్నట్టు వివరించింది.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు బీఎంసీ అదనపు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మార్చి 22 నుంచి అన్ని షాపింగ్ మాల్స్ వద్ద స్వాబ్ కలెక్షన్ సౌకర్యాన్ని తప్పనిసరి చేయనున్నట్టు తెలిపారు. దీని కోసం ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు తెలిపారు.






