అత్తపై గ్రేవీ ఒలకబోసిన వెయిట్రెస్.. టిప్ ఇచ్చిన కోడలు!

91

దిశ, ఫీచర్స్ : ఎవరి జీవితంలోనైనా సరే.. పెళ్లి అనేది ఓ మధుర జ్ఞాపకం. ప్రతీ ఒక్కరు తమ పెళ్లి అంగరంగ వైభవంగా, పద్ధతి ప్రకారం జరగాలని కోరుకుంటారు. అయితే మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? ఇక్కడ ఒక జంట పెళ్లి రోజున కూడా అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఆ వేడుకలో వెయిట్రెస్‌గా పనిచేసిన మహిళ వల్ల ఆ ఫంక్షన్ డిస్ట్రబ్ కాగా, అందుకు బదులుగా వధువు చేసిన పని తనను ఆశ్చర్యానికి గురిచేసిందని సదరు వెయిట్రెస్ అప్పటి విశేషాలను పంచుకుంది. అవేంటో మీరూ తెలుసుకోండి..

టిక్ టాక్ యూజర్ క్లోయ్.. తను సిల్వర్ సర్వీస్‌లో పనిచేసినపుడు జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. తను ఫుడ్ సర్వ్ చేసిన ఏకైక పెళ్లి వేడుక అదే అని తెలిపిన క్లోయ్.. అప్పుడు అనుకోకుండా వధువు అత్తగారి ఒళ్లో వేడిగా ఉన్న గ్రేవీ ఒలకబోశానని చెప్పింది. అయితే తనకు గాయాలేవీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నానని వెల్లడించింది. కానీ ఆ జంట పెళ్లిరోజును స్పాయిల్ చేశాననే బాధతో తను ఏడుస్తూ ఉండగా.. అప్పుడు వధువు చేసిన పనికి షాక్ అయ్యానని గుర్తుచేసుకుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత తన దగ్గరకు వచ్చిన పెళ్లి కూతురు షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పిందని, అక్కడితో ఆగకుండా ఈ పని చేసినందుకు తనకు 55 పౌండ్స్(రూ.5500/-) టిప్ కూడా ఇచ్చిందని తెలిపింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఆ వధువుకు తన పెళ్లిరోజున అత్తగారు వైట్ గౌన్ ధరించడం ఇష్టం లేదట. ఈ క్రమంలో నేను అత్తగారి గౌన్‌పై గ్రేవీ పోయడం వల్ల సంతోషంతో అలా చేసిందని, ఇప్పటికీ ఎక్కడైనా కనిపిస్తే తామిద్దరం హాయ్ చెప్పుకుంటామని చెప్పుకొచ్చింది.

కాగా ఈ వీడియో ఇప్పటికే 1.5 లక్షల లైకులతో నెట్టింట వైరల్‌గా మారగా, వధువు జీవితంలోని అద్భుతమైన రోజును ఆనందంగా మలిచినందుకు నెటిజన్లు క్లోయ్‌ను పొగుడుతున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘నీకు టిప్.. ఈ ఇన్సిడెంట్ తర్వాత అందిందా? లేదా ముందే తీసుకున్నావా? అని ప్రశ్నించగా.. ‘మా అత్తగారు నా పెళ్లి రోజున వైట్ గౌన్ ధరిస్తానంటే, ఆమెను కాదనలేక నేనే బ్లాక్ గౌన్ ధరించాను’ అని మరొక నెటిజన్ కామెంట్ చేయడం విశేషం.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..