సెకండ్ ట్రైలర్ రిలీజ్.. ఇక బుట్టబొమ్మతో సందడి చేయనున్న డార్లింగ్..

by Web Desk |
సెకండ్ ట్రైలర్ రిలీజ్.. ఇక బుట్టబొమ్మతో సందడి చేయనున్న డార్లింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్: బహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన డార్లింగ్ ప్రభాస్.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ గురించి ప్రభాస్ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్న సమయంలో.. రాధేశ్యామ్ సెకండ్ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు. యాక్షన్ సీన్స్, డైలాగ్‌లతో ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ట్రైలర్‌పై పాజిటివ్ రెస్పాన్స్ వస్తుడంటంతో డార్లింగ్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ట్రైలర్‌లో యాక్టింగ్‌తో డార్లింగ్.. ఇరగదీశాడు. కాగా, రాధేశ్యామ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం, హీరో ప్రభాస్ ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక, మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్ పలు సినీ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.

Next Story

Most Viewed