4.0 తీవ్రతతో భూకంపం.. జనం బెంబేలు

by Dishanational4 |
4.0 తీవ్రతతో భూకంపం.. జనం బెంబేలు
X

దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం కచ్ జిల్లాలోని భచౌ పట్టణం సమీపంలో ఉందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ISR) గుర్తించింది. ఆదివారం సాయంత్రం 4:45 గంటలకు భూ ప్రకంపనలు నమోదయ్యాయని తెలిపింది. భచౌ పట్టణం నుంచి 21 కిలోమీటర్లు వాయవ్యం దిశగా భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని కచ్ కలెక్టర్ అమిత్ అరోరా వెల్లడించారు. కచ్ జిల్లా ‘‘అధిక ముప్పు’’ కలిగిన భూకంప జోన్‌లో ఉంది. ఇక్కడ తక్కువ తీవ్రత కలిగిన భూప్రకంపనలు తరచుగా సంభవిస్తుంటాయి. 2001లో కచ్ జిల్లాలో సంభవించిన భారీ భూకంపం అనేక పట్టణాలు, గ్రామాలను ప్రభావితం చేసింది. ఆనాటి భూ విలయంలో దాదాపు 13,800 మంది చనిపోగా, 1.67 లక్షల మంది గాయపడ్డారు.

Next Story

Most Viewed