లిఫ్ట్ అడిగిన విద్యార్థికి ఊహించని షాక్ ఇచ్చిన దుండగులు.. ఒక్కసారిగా కారు డోర్ లాక్ చేసి

by Web Desk |
లిఫ్ట్ అడిగిన విద్యార్థికి ఊహించని షాక్ ఇచ్చిన దుండగులు.. ఒక్కసారిగా కారు డోర్ లాక్ చేసి
X

దిశ, శంషాబాద్: విద్యార్థిపై కత్తితో దాడిచేసి కారులో ఎక్కించుకుని పరార్ అవుతుండగా.. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాళ్లగూడలో జరిగింది. విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్‌కు చెందిన తరుణ్ మొయినాబాద్‌లో కాలేజీకి వెళ్లేందుకు రాజేంద్ర నగర్ వద్ద రోడ్డుపై నిల్చున్నాడు. రాజేంద్రర్ నగర్ వైపు నుండి ఓ కారు (MH 02 BJ 6812) రావడంతో లిప్ట్ ఆడిగాడు. వెంటనే వారు కారు ఆపి అతడిని ఎక్కించుకున్నారు. కారులో అప్పటికే డ్రైవర్ తోపాటు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. విద్యార్థి తరుణ్‌ను కార్లోకి ఎక్కించుకోగానే ఒక్కసారిగా కారు డోర్ లాక్ చేసి.. విద్యార్థిపై దాడికి దిగారు. కారు అతి వేగంగా శంషాబాద్ సర్వీస్ రోడ్డు మీదుగా వెళుతుండగా.. రాళ్లగూడ వద్దకు వెళ్లగానే విద్యార్థికి కారులో ఉన్న వ్యక్తులకు పెనుగులాట అయింది. దీనితో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు విద్యార్థిపై కత్తితో దాడిచేసి.. అతడి వద్ద ఉన్న సెల్ ఫోన్‌తో పాటు రూ.1,800 నగదును దొంగలించి పరార్ అవుతుండగా గమనించిన స్థానికులు నిందితుల్లో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గాయపడ్డ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.



Next Story

Most Viewed