- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Angelina Jolie: ఐదేళ్ల న్యాయపోరాటం.. భర్త చేతిలో ఓటమిపాలైన నటి
<p>దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ ఐదేళ్ల న్యాయ పోరాటంలో చివరికి ఓటమిని చవిచూసింది. తన భర్త బ్రాడ్ పిట్ తో విడాకులను కోరుతూ ఐదేళ్ల క్రితం కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఐదేళ్ల నుండి సాగుతున్న ఈ న్యాయ పోరాటంలో న్యాయస్థానం బ్రాడ్ పిట్ కి అనుకూలంగా తీర్పునివ్వడంతో ఏంజెలినా ఓటమిపాలయ్యారు. 2014 లో ప్రేమించుకొని ఒక్కటయ్యిన ఈ జంట రెండేళ్లలోనే విడాకులకు సిద్ధమయ్యారు. అప్పటికే వీరికి ఆరుగురు పిల్లలు. ఇక పిల్లల సంరక్షణ తల్లిగా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ ఐదేళ్ల న్యాయ పోరాటంలో చివరికి ఓటమిని చవిచూసింది. తన భర్త బ్రాడ్ పిట్ తో విడాకులను కోరుతూ ఐదేళ్ల క్రితం కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఐదేళ్ల నుండి సాగుతున్న ఈ న్యాయ పోరాటంలో న్యాయస్థానం బ్రాడ్ పిట్ కి అనుకూలంగా తీర్పునివ్వడంతో ఏంజెలినా ఓటమిపాలయ్యారు. 2014 లో ప్రేమించుకొని ఒక్కటయ్యిన ఈ జంట రెండేళ్లలోనే విడాకులకు సిద్ధమయ్యారు. అప్పటికే వీరికి ఆరుగురు పిల్లలు. ఇక పిల్లల సంరక్షణ తల్లిగా తనకే ఇవ్వాలని కోరుతూ ఏంజెలీనా న్యాయస్థానాన్ని అభ్యర్ధించింది.
కొన్నేళ్లుగా వాయిదాల మీద నడుస్తున్న ఈ కేసులో న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించింది. తమ ఐదుగురు పిల్లల బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరు చూసుకోవాలని సంచలన తీర్పునిచ్చింది. ఇక వారి పెద్ద కొడుకు మాడోక్స్ కస్టడీ గురించి మాత్రం ఎటూ తేల్చలేకపోయింది. అయితే ఈ తీర్పుపై ఏంజెలీనా మండిపడింది. తనకు న్యాయం జరగలేదని, జడ్జిని బ్రాడ్ పిట్ కొనేశాడని ఆరోపించింది. అందుకే అతనికి అనుకూలంగా తీర్పునిచ్చారని, ఈ తీర్పును తాను ఒప్పుకోవడం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా మరోసారి రీ పిటిషన్ దాఖలు చేస్తానని తెలిపింది.






