బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్శిటీ ప్రవేశాల గడువు పెంపు..

by  |
బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్శిటీ ప్రవేశాల గడువు పెంపు..
X

దిశ, బంజారాహిల్స్ : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్శిటీ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్‌ గడువు చివరి తేదీని ఆలస్యపు రుసుముతో అక్టోబర్‌ 31వ తేదీ వరకు పొడిగించినట్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ ఎంఎ ,ఎమ్మెస్సి, ఎం. కామ్ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా కోర్సులలో చేరే అభ్యర్ధులు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అడ్మిషన్లు పొందేవారు రూ.200 ఆలస్యపు రుసుముతో 31వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరాల కోసం www .braouonline.in సైట్‌లో గానీ, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లోని వర్శిటీ అధ్యయన సంస్థలో గానీ సంప్రదించాలన్నారు.


Next Story

Most Viewed