కరెంట్ షాక్‌తో బాలుడు మృతి

89

దిశ ప్రతినిధి, మేడ్చల్:
మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే….జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని అరుంధతి నగర్ కు చెందిన నిఖిల్ అనే బాలుడు కరెంట్ షాక్ తగిలి మరణించాడు. కంచె లేకుండా ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను నిఖిల్ తాకడంతో అతనికి కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అతని శరీరం కాలిపోయింది. కాగా చికిత్స నిమిత్తం బాలుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు శనివారం మృతి చెందాడు.