అఖిలప్రియకు కరోనా పరీక్షలు..

65

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న అఖిల ప్రియకు పోలీసులు కరోనా పరీక్షలు చేయించనున్నారు. ముందుగా ఆమెను బేగంపేటలోని పాటిగడ్డ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు తరలించి, కరోనా పరీక్షలు చేయిస్తారు. అనంతరం ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం సమయంలో అఖిలప్రియను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా హఫీజ్‌పేటలోని ల్యాండ్ ఇష్యూ కేసులో ప్రవీణ్ రావుతో పాటు అతని సోదరులిద్దరినీ కిడ్నాప్ చేసిన ఘటనలో అఖిలప్రియ మూడు రోజుల కస్టడీని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..