పోలీసులను ఆశ్రయించిన బొండా ఉమా

by  |
పోలీసులను ఆశ్రయించిన బొండా ఉమా
X

దిశ, వెబ్‎డెస్క్ : తనపై కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని విజయవాడ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఓ ప్రముఖ హోటల్ నుంచి హిరోయిన్‎తో కలిసి బయటకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ ప్రత్యర్థులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి పోస్టింగులతో ప్రజల్లో తనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, సోషల్ మీడియాలో పోస్టులో ఉన్న ఆ హీరోయిన్ ఎవరో కూడా తనకు తెలియదని, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని బొండా ఉమా స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed