- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైసమ్మ ఆలయంలో ఘనంగా బోనాలు
by Shyam |
<p>దిశ సిద్దిపేట: 12వ ఆషాడ మహోత్సవంలో భాగంగా పట్టణంలోని ప్రశాంత్ నగర్లో గల శ్రీ శ్రీ శ్రీ మహా మైసమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. పూజా కార్యక్రమంలో భాగంగా ఆదివారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుండి భక్తులు పాల్గొని అమ్మవారికి బోనాలు, ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామునే వేద పండితులు మైసమ్మ తల్లికి గణపతి పూజ,స్వస్తి పుణ్యాహవాచనం, […]</p>

X
దిశ సిద్దిపేట: 12వ ఆషాడ మహోత్సవంలో భాగంగా పట్టణంలోని ప్రశాంత్ నగర్లో గల శ్రీ శ్రీ శ్రీ మహా మైసమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. పూజా కార్యక్రమంలో భాగంగా ఆదివారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుండి భక్తులు పాల్గొని అమ్మవారికి బోనాలు, ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామునే వేద పండితులు మైసమ్మ తల్లికి గణపతి పూజ,స్వస్తి పుణ్యాహవాచనం, పంచామృత అభిషేకం జరిపించారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని భక్తులు భౌతిక దూరం పాటించేలా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Next Story






