- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో సూర్య ఆఫీసుకు బాంబు బెదిరింపులు..!
<p>దిశ, వెబ్‌డెస్క్ : స్టార్ హీరోల ఆఫీసులకు బాంబు బెదిరింపులు ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయ్యాయి. ముఖ్యంగా కోలీవుడ్ హీరోలకు ఆ బెదిరింపు కాల్స్ అలవాటుగా మారాయని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ మొదలుకుని, హీరో అజిత్, దర్శకుడు మణిరత్నం, స్టార్ హీరో విజయ్ తదితరుల ఇళ్లు, ఆఫీసుల్లో బాంబులు పెట్టామంటూ వార్నింగ్ కాల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు హూటాహుటిన సదరు స్టార్స్ ఇళ్లు, ఆఫీసులను చెక్ చేయడం.. అక్కడ ఎలాంటి బాంబు లేదని, […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : స్టార్ హీరోల ఆఫీసులకు బాంబు బెదిరింపులు ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయ్యాయి. ముఖ్యంగా కోలీవుడ్ హీరోలకు ఆ బెదిరింపు కాల్స్ అలవాటుగా మారాయని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ మొదలుకుని, హీరో అజిత్, దర్శకుడు మణిరత్నం, స్టార్ హీరో విజయ్ తదితరుల ఇళ్లు, ఆఫీసుల్లో బాంబులు పెట్టామంటూ వార్నింగ్ కాల్స్ వచ్చాయి.
దీంతో పోలీసులు హూటాహుటిన సదరు స్టార్స్ ఇళ్లు, ఆఫీసులను చెక్ చేయడం.. అక్కడ ఎలాంటి బాంబు లేదని, ఆ ఫోన్ కాల్ ఫేక్ అని నిర్దారించుకోవడం జరిగాయి. తాజాగా మరో నకిలీ కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైలోని అల్వార్‌పేట ప్రాంతంలో ఉన్న హీరో సూర్య ఆఫీసులో బాంబు పెట్టినట్లు పోలీసులకు కాల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న వారు తనిఖీలు చేయగా, ఎలాంటి బాంబు దొరకలేదు.ఈసారి కూడా వచ్చింది ఫేక్ కాల్ అని తెలిసి పోలీసులు తిరుగుముఖం పట్టారు.






