- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
#BollywoodStrikesBack.. మీడియా సంస్థలపై కేసు
<p>దిశ, వెబ్‌డెస్క్: ‘బాలీవుడ్ స్ట్రైక్స్ బ్యాక్’ పేరుతో కలిసి వచ్చిన ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ.. న్యూస్ చానల్స్‌పై ఢిల్లీ కోర్టులో సివిల్ సూట్ వేసింది. బాలీవుడ్ ప్రతిష్టను, కీర్తిని దెబ్బతీసేలా.. ఇండస్ట్రీకి వ్యతిరేకంగా న్యూస్ పబ్లిష్ చేయడంపై మీడియా చానల్స్, సోషల్ మీడియాను ప్రశ్నించింది. బాలీవుడ్ ఇండస్ట్రీ అసోసియేషన్స్‌తో పాటు 34 మంది బాలీవుడ్ నిర్మాతల తరపున డీఎస్కే పిటిషన్ దాఖలు చేశారు. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రూల్స్ 1994 ప్రకారం బాలీవుడ్‌కు వ్యతిరేకంగా న్యూస్ ప్రసారం చేస్తున్న […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ‘బాలీవుడ్ స్ట్రైక్స్ బ్యాక్’ పేరుతో కలిసి వచ్చిన ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ.. న్యూస్ చానల్స్‌పై ఢిల్లీ కోర్టులో సివిల్ సూట్ వేసింది. బాలీవుడ్ ప్రతిష్టను, కీర్తిని దెబ్బతీసేలా.. ఇండస్ట్రీకి వ్యతిరేకంగా న్యూస్ పబ్లిష్ చేయడంపై మీడియా చానల్స్, సోషల్ మీడియాను ప్రశ్నించింది. బాలీవుడ్ ఇండస్ట్రీ అసోసియేషన్స్‌తో పాటు 34 మంది బాలీవుడ్ నిర్మాతల తరపున డీఎస్కే పిటిషన్ దాఖలు చేశారు. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రూల్స్ 1994 ప్రకారం బాలీవుడ్‌కు వ్యతిరేకంగా న్యూస్ ప్రసారం చేస్తున్న ‘రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ’ వంటి చానల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని నెలలుగా మీడియా డర్టీ, డ్రగీస్ లాంటి పదాలను వినియోగిస్తోందని.. అలాంటి పదాలు వాడకూడదని సూచించారు.
కాగా, మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన నిర్మాణ సంస్థల లిస్ట్‌లో అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అనిల్ కపూర్, కరణ్ జోహార్‌లకు సంబంధించినవి కూడా ఉన్నాయి.






