భర్త పోర్న్ వీడియో కేసు.. ఎట్టకేలకు నోరువిప్పిన శిల్పాశెట్టి

by  |
భర్త పోర్న్ వీడియో కేసు.. ఎట్టకేలకు నోరువిప్పిన శిల్పాశెట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోన్న రాజ్ కుంద్రా కేసు పై తొలిసారి ఆయన భార్య, నటి శిల్పాశెట్టి స్పందించారు. అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా పోలీసుల రిమాండ్ లో ఉన్నారు. ఇక భర్త అరెస్ట్ అయినప్పటినుంచి మీడియాకు దూరంగా ఉన్నా శిల్పా ఎట్టకేలకు సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియజేసారు. ” కోపంలో వెనక్కి తిరిగి చూడకు, భయంగా ఉన్నప్పుడు భవిష్యత్తును చూడకు. పూర్తి అవగాహనతో చుట్టుపక్కల చూడు” అంటూ ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ నవలలోని వాక్యాలను గుర్తుచేసింది. అంతేకాకుండా అదృష్టవశాత్తు తాను ఇంకా బతికే ఉన్నానని తెలిసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నానని తెలిపింది.

గతంలో తాను ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నానని, భవిష్యత్తులో కూడా అలాంటి సవాళ్ళను ఎదుర్కొంటానని చెప్పుకొచ్చింది. ఏం జరిగినా తానూ జీవిస్తానన్న శిల్పా ఏ శక్తి తనను ఆపలేదని తెలిపింది. మరి ఇందులో భర్త కు సపోర్ట్ గా నిలుస్తుందా..? లేదా ..? అనేది మాత్రం ఆమె బయటపెట్టలేదు. అయితే.. తనవరకు తాను ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెప్తుందని నెటిజన్లు అంటున్నారు. ఇకపోతే ఈ కేసు లో శిల్పాశెట్టి పాత్ర ఏమైనా ఉందా..? భార్యకు తెలియకుండానే రాజ్ కుంద్రా ఈ వ్యవహారం మొత్తం నడిపాడా..? అని పోలీసులు విహకరిస్తున్నట్లు తెలుస్తోంది.

పోర్న్ వీడియోలు చూస్తున్నప్పుడు.. చేస్తే తప్పేంటి?

Next Story

Most Viewed