షకీలా రోల్ ఛాలెంజింగ్: రిచా చద్దా

by  |
షకీలా రోల్ ఛాలెంజింగ్: రిచా చద్దా
X

దిశ, వెబ్‌డెస్క్: మాలీవుడ్ తార షకీలాను సూపర్ స్టార్‌గా చూపిస్తూ తెరకెక్కిన బయోపిక్ ‘షకీలా’. బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఈ నెల 25 న రిలీజైంది. 1990ల‌లో త‌న సినిమాల‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సీనియ‌ర్ న‌టి షకీలా జీవితంలోని ప‌లు కోణాలను ఈ మూవీ ఆవిష్కరించింది. చిత్రంలో రిచా చద్దా నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రిచ మీడియాతో ముచ్చటించింది.

షకీలా రోల్ ఛాలెంజింగ్‌గా అనిపించిందని, పాత్రలో లీనం అవ్వడం కోసం చాలా కష్టపడ్డానని తెలిపింది. మ‌ల‌యాళంలో ష‌కీలాకు స్టార్‌డ‌మ్ తెచ్చిపెట్టిన సినిమాల లిస్ట్‌ తెప్పించుకుని, అన్ని సినిమాల‌ను చూశానని చెప్పింది. షకీలా వ్యక్తిగత జీవితం, వ్యక్తిత్వం, స్టార్‌డమ్ గురించి తెలుసుకున్నానని పేర్కొంది. ద‌క్షిణాది సినిమాకు ఫ్రెష్‌నెస్ ఫ్లేవ‌ర్‌ను అందించిన సినిమా ‘షకీలా’ అని చెప్పింది. ఎవ‌రి గురించి చెడుగా మాట్లాడ‌క‌పోవ‌డం షకీలాలోని గొప్ప గుణం అంటూ చెప్పుకొచ్చింది.


Next Story

Most Viewed