మహా కుంభమేళాకు వెళ్లిన బాలీవుడ్ నటుడు.. ఆమెతో కలిసి ప్రత్యేక పూజలు (పోస్ట్)

by Mallepaka Hamsa |   (  Updated:2025-02-08 10:18:36  IST  )

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళాకు జనాలు ఎగబడుతున్నారు.

మహా కుంభమేళాకు వెళ్లిన బాలీవుడ్ నటుడు.. ఆమెతో కలిసి ప్రత్యేక పూజలు (పోస్ట్)
X

దిశ, సినిమా: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళాకు జనాలు ఎగబడుతున్నారు. 144 సంవత్సరాల అనంతరం జరుగుతున్న ఈ మహోత్సవం ను చూసేందుకు సినీ ప్రియులతో పాటు ప్రముఖులు సాధారణ భక్తులు ఉత్సాహంగా ఉన్నారు. పనులను పక్కన పెట్టి కుంభమేళాకు వెళ్లి అక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఇప్పటికే కుంభమేళాకు చాలామంది సినీ సెలబ్రిటీలు వెళ్లిన విషయం తెలిసిందే. నిత్యం అక్కడ కొంతమంది సినీ సెలబ్రిటీలు పుణ్యస్నానాలు ఆచరిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

అలాగే పత్యేక పూజలు కూడా చేసి అక్కడి ప్రదేశాలను చుట్టేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అంతా కుంభమేళాలో దర్శనమిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు(Raj Kumar Rao) తన భార్యతో కలిసి ప్రయోగ్ రాజ్‌కు వెళ్లారు. అక్కడ పుణ్య స్నానం ఆచరించి త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజ చేశారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా రాజ్ కుమార్ ఇటీవల ‘స్త్రీ-2’చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఇక గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.

Next Story