బ్రేకింగ్: మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యజమాని హత్య.. ఆగి ఉన్న కారులో మృతదేహం..?

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-19 02:04:07  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో ఆగిఉన్న కారులో మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. గురువారం ఉదయం డీవీ మ్యానర్‌ హెటల్‌ పక్కసందులో ఏపీ 16 ఎఫ్ఎఫ్ 9999 బ్లాక్ ఎండీవర్ కారులో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడిని తాడిగడపకు చెందిన కరణం రాహుల్‌గా పోలీసులు గుర్తించారు. మృతుడు జి. కొండూరులో గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన జిక్సిన్ సిలిండర్ కంపెనీ [&hellip;]</p>

బ్రేకింగ్: మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యజమాని హత్య.. ఆగి ఉన్న కారులో మృతదేహం..?
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో ఆగిఉన్న కారులో మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. గురువారం ఉదయం డీవీ మ్యానర్‌ హెటల్‌ పక్కసందులో ఏపీ 16 ఎఫ్ఎఫ్ 9999 బ్లాక్ ఎండీవర్ కారులో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడిని తాడిగడపకు చెందిన కరణం రాహుల్‌గా పోలీసులు గుర్తించారు.

మృతుడు జి. కొండూరులో గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన జిక్సిన్ సిలిండర్ కంపెనీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది హత్యా..? లేక ఆత్మహత్యా..? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వ్యాపారంలో విబేధాల వలనే శత్రువులు హత్య చేసి ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల సమాచారం మేరకు మృతుడు కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.

Next Story