అలాంటి పాత్రలు చేయకూడదనే రూల్ లేదు కదా!

by  |
అలాంటి పాత్రలు చేయకూడదనే రూల్ లేదు కదా!
X

దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్.. కెరియర్ స్టార్టింగ్‌లోనే స్టార్‌డమ్ చూసినా, ఆ తర్వాత తన కెరియర్ గ్రాఫ్ స్లోగా పడిపోవడంతో చాన్స్‌లు రాకుండా పోయాయి. దీంతో కొన్నేళ్లు ఇంటికే పరిమితమైన బాబీ డియోల్ ఆ తర్వాత ‘ఆశ్రమ్’ సిరీస్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాడు. ప్రకాశ్ ఝా దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ సూపర్ పాపులర్ అయింది. ఎంఎక్స్ ప్లేయర్‌లో మోస్ట్ వ్యూస్‌తో దూసుకుపోతూ.. బాబా నిరాళగా పాత్రకు గాను బాబీ డియోల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(బెస్ట్ యాక్టర్‌)ను తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా తన కెరియర్‌లో అప్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడారు బాబీ.

ఒకప్పుడు బిగ్ స్టార్‌గా ఉన్న తనకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో మార్కెట్ వాల్యూ పడిపోయి ఇంట్లోనే కూర్చుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపాడు. అయినా సరే, ఆ టైమ్‌లో లీడ్ రోల్స్‌ కాకుండా సపోర్టింగ్ యాక్టర్ రోల్స్ చేయాలంటే ఆలోచించానని, కానీ పని చేయకుండా నాన్న ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడని పిల్లలు అనుకునే సమయంలో తను రియలైజ్ అయ్యానని తెలిపాడు. తను ఒక నటుడిని.. తను చేయాల్సిన పని నటన, అలాంటప్పుడు ఏ క్యారెక్టర్ అయితే ఏంటి? అనే ఆలోచనకు వచ్చానన్నాడు బాబీ. యాక్టర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ కొత్తగా ప్రాజెక్ట్‌లు అంగీకరించానని, ఫలితంగా నటుడిగా మరో మెట్టు ఎక్కానని తెలిపాడు.


Next Story

Most Viewed