- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంద్రావతి నదిలో పడవల బోల్తా
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో పడవ ప్రమాదం జరిగింది. ఇంద్రావతి నదిలో మంగళవారం రాత్రి రెండు నాటు పడవలు బోల్తాపడడంతో ముగ్గురు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా సోమన్‌పల్లికి చెందిన కొంతమంది.. పొరుగున ఉన్న చత్తీస్ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రామనికి హజరై తిరిగి వస్తున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నాటు పడవలో తిరుగు ప్రయాణం కాగా పడవలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో పడవ ప్రమాదం జరిగింది. ఇంద్రావతి నదిలో మంగళవారం రాత్రి రెండు నాటు పడవలు బోల్తాపడడంతో ముగ్గురు గల్లంతయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా సోమన్‌పల్లికి చెందిన కొంతమంది.. పొరుగున ఉన్న చత్తీస్ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రామనికి హజరై తిరిగి వస్తున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నాటు పడవలో తిరుగు ప్రయాణం కాగా పడవలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతవ్వగా.. మరో 13 మందిని స్థానికులు, అధికారులు రక్షించారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అత్యంత ప్రమాదకరంగా ఉండే ఇంద్రావతి నది మీదుగా నాటు పడవల్లో రాత్రి వేళల్లో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Next Story






